Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో అందరికీ ఉచితంగా 50 మందులు

అనారోగ్యం వస్తే పేదవారు, మధ్య తరగతి ప్రజల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 50 అత్యవసర మందులను దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలని కేంద్రంలోని మోడీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ముందుగా కొన్ని ఆస్పత్రుల్లో ఈ పథకాన్ని ప్రారంభించి దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా ఉచితంగా అందజేసే 50 మందుల్లో బీపీ, షుగర్ మందులు కూడా ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ అత్యవసరమైన 50 రకాల మందులు ఉచితంగా అందించాలన్నది యోచన.

More Telugu News